జఫర్ గడ్ గ్రామ మొట్ట మొదటియం బి బి ఎస్ డాక్టర్ గా సింగారపు అక్షిత

జ్ఞాన తెలంగాణ, జఫర్ గడ్ఏ,ప్రిల్ 09 :
జఫర్ గడ్ మండల కేంద్రానికి చెందిన సింగారపు బల రాములు (లేటు), సింగారపు ఉమాదేవి దంపతుల కుమార్తె డాక్టర్. సింగారపు అక్షిత,కాకతీయ మెడికల్ కాలేజీ వరంగల్ లో
యం బి బి ఎస్ పూర్తి చేసుకొని మంగళవారం రోజున కాకతీయ మెడికల్ కాలేజ్ కాన్వకేషన్
యం బి బి ఎస్ వైద్య డిగ్రీ పట్టా అందుకోవడం జరిగిందని డాక్టర్ అక్షిత సంతోషం గా తెలిపారు.ఈ సందర్బంగా అక్షిత మాట్లాడుతూ నేను బాగా చదువుకొని డాక్టర్ కావాలని మా డాడీ కోరిక మేరకు, నేను పట్టుదలతో చదివి డాక్టర్ కావడం జరిగిందని, కానీ నేను మా డాడీ కష్టం కాలంలో ఉన్నప్పుడు అమ్మ, డాడీ,అన్నయ్య పడ్డ కష్టం తో నా కళ్ల ముందు కనిపించేవి అని,బాగా చదివి నా తల్లి దండ్రులు ఆశయం నెరవేర్చాలనే కోరికతో పట్టుదల తో చదివాను, నేను డాక్టర్ గా చదవడం మా అమ్మ,డాడీ కీ, నేను యం బి బి ఎస్ పూర్తి చేయడానికి నాకు సహకారం అందించిన మా డాడీ ఫ్రెండ్స్ కీ నేను ఎప్పుడు ఋణ పడి ఉంటానని వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిజేస్తున్నానని తెలిపారు, నేను డాక్టర్ గా పోస్ట్ గ్రాడ్యుయేట్ లో జనరల్ మెడిసిన్ చేసి నా గ్రామానికి, బీద వారికి నా వంతు సేవ చేస్తానని అన్నారు.అంతే కాకుండా జఫర్ గడ్ గ్రామ నివాసిగా మొట్ట మొదటి యం బి బి ఎస్ డాక్టర్ గా చదివి పట్టా అందుకోవడం ఆనందం ఉందని తెలిపారు. డాక్టర్ అక్షిత కు జఫర్ గడ్ గ్రామం లోని పలువురు, గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అందరూ అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.