ఆయుష్ విభాగంలో ఫార్మసిస్టుల నియామకానికి విద్యార్హతలను సవరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి డీఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మాడీ విద్యార్హతలు కలిగి, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయినవారు మాత్రమే ఈ పోస్టుల్లో నియామకానికి అర్హులని పేర్కొంది. గతంలో ఆయుష్ సొంతంగా నిర్వహించే డిప్లొమా చేసిన వారికి మాత్రమే అవకాశం ఉండేది. ఒకవేళ ఈ ఫార్మసిస్టుల పోస్టుల్లో నేరుగా నియమితులై ఉంటే ఆయుష్, యునాని, హోమియో కళాశాలల్లో తప్పనిసరిగా ఆరు నెలల థియరీ, ప్రాక్టికల్స్ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి పరీక్ష ఉత్తీర్ణత సాధించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.