ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాడిగారి రాజశేఖర్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా మండలంలోని మహాలింగాపురం గ్రామంలో ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పీఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.సోమవారం తన సొంత గ్రామమైన మహాలింగాపురంలో ముస్లిం సోదరులతో ఆప్యాయంగా కలిసిన ఆయన, వారితో ముచ్చటిస్తూ రంజాన్ పర్వదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లిం సోదరుల జీవితంలో అత్యంత పవిత్రమైనదని, దీని ద్వారా ధర్మ నిష్ఠ, సామరస్య భావనలు మరింత పెరుగుతాయని అన్నారు.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర మాసంలో ఉపవాస దీక్ష పాటించిన ప్రతి ముస్లిం సోదరునికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కాడిగారి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.


