రెండవ రోజు హిందీ పరీక్ష ప్రశాంతం-కానీ ఐదుగురు గైర్హాజరు

రెండవ రోజు హిందీ పరీక్ష ప్రశాంతం-కానీ ఐదుగురు గైర్హాజరు

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో పది తరగతి పరీక్షలు రెండో రోజు కూడా ప్రశాంతంగా జరిగాయి. శనివారం నిర్వహించిన హిందీ పరీక్షకు మొత్తం 1,000 మంది విద్యార్థులలో 995 మంది హాజరయ్యారు, ఐదుగురు గైర్హాజరయ్యారని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) అక్బర్ తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, గదుల్లో తగిన వసతులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు సాగిపోవడంతో విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, పరీక్షల అనంతరం ప్రశ్నపత్రం సాధారణంగా ఉందని విద్యార్థులు తెలిపారు. మిగిలిన పరీక్షలు కూడా ఇలాగే ప్రశాంతంగా సాగాలని విద్యార్థులు ఆశిస్తున్నారు.

You may also like...

Translate »