ఏడాది గడుస్తున్నా ఉపాధ్యాయులకు అందని రెమ్యూనరేషన్

వెంటనేఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలి
టిఆర్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్
ప్రధాన కార్యదర్శి జామ కుషాల్


జ్ఞానతెలంగాణ,రంగారెడ్డి :
ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు ఎస్ఎస్సి స్పాట్వా ల్యువేషన్ లో ఏ ఈ, సి ఈ, స్పెషల్ అసిస్టెంట్ ఇతర విధులు నిర్వహించినఉపాధ్యాయులకు ఏడాది గడుస్తున్నా నేటికి రెమ్యూనరేషన్ చెల్లించలేదని వెంటనే చెల్లించాలని టిఆర్ టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ జిల్లా ఏ డి గారికి వినతిపత్రం బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా జామ కుషాల్ మాట్లాడుతూ ఈ విద్య సంవత్సరానికి సంబంధించిన ఎస్ ఎస్ సి పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో పూర్తి కానున్నాయి. ఆ వెంటనే మూల్యాంకణం కూడా ప్రారంభం కానున్నది ఈ నేపథ్యంలోరెమ్యూనరేషన్ డబ్బులు సత్వరం చెల్లించని పక్షంలో ఉపాధ్యాయుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం ఎస్ ఎస్ సి స్పాట్ విధుల బహిష్కరణ కు తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ సంఘ పక్షాన పిలుపు ఇవ్వవలసి వస్తుందన్నారు. కావున స్పాట్ రెమ్యూనరేషన్ డబ్బులు సత్వరం చెల్లించాలని సంఘ పక్షాన డిమాండ్ చేశారు.

You may also like...

Translate »