నేడు చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 128 వ వర్థంతి

నేడు చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 128 వ వర్థంతి
సావిత్రిబాయి 1831 జనవరి 3 వ తేదీన మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని నయగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించారు.చదువులతల్లి సావిత్రి బాయి మహారాష్ట్ర లో మహాత్మా జ్యోతిరావు ఫూలే సహధర్మచారిణిగా బ్రిటీష్ పాలనాకాలనాటికే మన దేశంలో ఉన్న సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన వనిత సావిత్రి బాయి ఫూలే.ఆనాడు ఈ భారతదేశం లో పేరుకే బ్రిటిష్ పాలన ఉన్నా బ్రాహ్మణ మనువాదులు రూపొందించిన మనుస్మృతి అంటే మనుధర్మశాస్త్రం ప్రకారం సమాజం నడుచుకునేలా బ్రిటీష్ పాలకులను సైతం తమ వైపు తిప్పుకున్నారు.బ్రిటీష్ వాళ్ళతో రాజీపడి అధికారంలో భాగస్వామ్యం కోసం దేశభక్తి లేకుండా వాళ్ళకి సహకరించింది కూడా మనువాద బ్రాహ్మణులు. స్త్రీలు చదువుకోరాదు.బాల్య వివాహాలు చేయడం ,వితంతువులకు వివాహాలు చేయరాదు. ఇలా ఎన్నో విధాలుగా బ్రాహ్మణ మనువాదులు వాళ్ళ ఆచారాలుగా పాటాంచారు.మొదట వాళ్ళ లో వాళ్ళు వర్ణ సంకరం జరగడానికి ఇష్టం లేక ఈ విధమైన అమానుష మైన ఆచారాలు పెట్టి మహిళలను హింసించారు.మహిళలను కేవలం వంట ఇంటికి పడక గదికి మాత్రమే పరిమితం చేశారు.సమాజంలో ద్వితీయ శ్రేణి మనిషి గా మహిళలను చూసారు.మనుస్మృతి ప్రకారం మహిళలు శూద్రులు, అతి శూద్రులు ఒకటిగా పరిగణించారు. ఇంత దారుణంగా ఉన్న రోజులలో సావిత్రి బాయి తన భర్త ప్రోత్సాహం తో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయినిగా కింది కులాలు గా చెప్పబడుతున్న అంటరానితనం అనుభవించిన అతిశూద్రులైన ఎస్సీ లకు ,వెనుక బడిన తరగతులు గా నేడు చెప్పబడుతోన్న బిసీలకు ,ఈనాటి ఎగువ శూద్రులు అయిన కమ్మ ,కాపు ,రెడ్డి, వెలమ ,బలిజలకు మొత్తం గా సమాజంలో చదువు ఎవరికి అయితే నిషేధం విధించారో వాళ్ళందరికీ చదువు నేర్పింది. ఆనాటి దుర్మార్గమైన ఆంక్షలను ధిక్కరించిన ధీర వనిత సావిత్రి బాయి. మగవాళ్ళు అదికూడా మూడు కులాలు మాత్రమే చదువుకోవాలని మనుస్మృతి చెప్పింది. మనువాద బ్రాహ్మణులు తమ తెలివిని, సాహిత్యాన్ని తమ అధికారాన్ని ఉపయోగించి అమలు జరిపారు. మహిళలు చదువు కుంటే బుద్ధి లేనిదవుతుందని చెప్పారు. ఒక పక్కన చదువులతల్లి సరస్వతి అంటూనే స్త్రీ చదువు నిషేధించడం ఏం సంస్కృతి. మొట్టమొదటి సారిగా మహాత్మా జోతిరావు, సావిత్రి బాయి ఫూలే లు బాలికల కోసం బడులు స్థాపించారు. వితంతువులు కోసం శరణాలయాలు స్థాపించారు.మానవత్వం గల పుణ్య దంపతులు వీళ్ళిద్దరూ. వీళ్ళు చేసిన కృషి ఫలితంగానే నేడు మహిళల జీవితాల్లో ఈ మాత్రం వెలుగులు ఉన్నాయి.
బ్రాహ్మణ మహిళలు ముఖ్యంగా చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అవడం వలన భర్త చనిపోతే ఆమెను ఆ కులంలోని వాళ్ళే బలవంతంగా అనుభవించి గర్భం చేస్తే అలాంటి వాళ్ళను చేరదీసి ఆ పిల్లలను సాకిన మాతృమూర్తి సావిత్రి బాయి.అలా ఒక విధవరాలు కని వదిలేస్తే ఆ పసిబిడ్డను తమ బిడ్డగా పెంచారు.అతనే యశ్వంత్ రావు.ప్లేగు వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు సేవ చేసింది. ఆ క్రమంలో ఆ వ్యాధి తనకు సోకి మరణించింది సావిత్రిబాయి.
ఇంత త్యాగం చేసిన సావిత్రి బాయి అసలైన అమ్మ …

భారతీయ చరిత్రలో మొట్టమొదటి పరిణయాన్ని సత్య శోధక సమాజం నిర్వహించింది :
భారతీయ చరిత్రలో 1873 వ సంవత్సరంలో సెప్టెంబర్ 24 వ తేదీన మహాత్మా జోతిబా ఫూలే-సావిత్రి బాయి దంపతులు సత్య శోధక సమాజాన్ని స్థాపించారు.1873 వ సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీన భారతీయ చరిత్రలోనే తొలిసారిగా అంటే సరిగ్గా 148 సంవత్సరాలు క్రితం సత్య శోధక సమాజం ఆధ్వర్యంలో బ్రాహ్మణ పురోహితుడు లేకుండానే మహాత్మా జోతిబా ఫూలే-సావిత్రి బాయి దంపతులు సత్య శోధక సమాజం సభ్యులు కలిసి ఆదర్శ పరిణయాన్ని నిర్వహించారు.పెళ్ళి కొడుకు సీతారాం జబాజీ అల్హత్ – పెళ్ళి కూతురు రాధా నింబాంకర్ ల పరిణయానికి ఖర్చులను సావిత్రిబాయి ఫూలే భరించారు.
“దైవ స్వరూపులుగా భావించే బ్రాహ్మణుల చేతుల్లో
రెండు వేల సంవత్సరాలు నిరంతరం అణచివేయబడిన
శూద్రుల పరిస్థితి చూస్తుంటే
మనసు ద్రవించి పోతుంది.
మెదడు మొద్దుబారి పోతుంది.
ఈ చట్రం నుంచి శూద్రులు బయటపడాలంటే,
విద్య ఒక్కటే మార్గం.
సాటి మనిషిని జంతువులా చూసే
సమాజం నుంచి మానవత్వాన్ని గౌరవించే స్థితి తీసుకువచ్చేది
ఈ విద్య ఒక్కటే.”
భారతీయ మొట్టమొదటి ఉపాధ్యాయిని:
మనదేశంలో ఈరోజు మహిళలు చదువుకుని ఉన్నత విద్యావంతులు అయి,మంచి ఉద్యోగాలలో ఉంటున్నారు అంటే ఈ మార్పుకు ఆనాడు మహాత్మా జోతిరావు ఫూలే-సావిత్రి బాయి దంపతులు చేసిన కృషి, త్యాగం ఎంతో ఉంది. ఆనాడు హిందూ బ్రాహ్మణ వైదిక సమాజం మనదేశంలో మహిళలకు ,శూద్రులకు ,అతి శూద్రులకు చదువుకోవడం నీషేధించింది.బయటి దేశం నుంచి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణులు మనదేశంలో ఉన్న మూలనివాసీ ప్రజలను తమ ఆధిపత్యంతో అణచివేశారు. దైవం పేర ,యజ్ఞాలు, యాగాలు పేర కర్మకాండలు ,క్రతువుల పేరుతో ఈ దేశంలో వర్ణ వ్యవస్థను రూపొందించారు. బ్రహ్మ దేవుడు ఈ సృష్టిని తయారు చేసాడని కట్టుకథలు నమ్మించి బలవంతంగా అమలు చేశారు.బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు ,భుజాలు నుండి క్షత్రియులు ,తొడల నుండి వైశ్యులు, పాదాలు నుండి శూద్రులు పుట్టారని కాబట్టి శూద్రులు పై మూడు వర్ణాల ప్రజలకు సేవలు చేయాలని సుమారు మూడున్నర సంవత్సరాల పాటు బ్రాహ్మణులు ఈ దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మనుధర్మశాస్త్రం అనే ఒక చట్టాన్ని తయారు చేసి అమలు చేశారు. ఇది ఒక అధర్మ శాస్త్రం. మన మెజారిటీ ప్రజలను దోపిడీ చేయడానికి, అణచివేయడానికి రూపొందించిన ఒక దుర్మార్గపు శాసనం. మనుధర్మశాస్త్రం ప్రకారం మహిళలు ఆనాడు చదువుకోరాదు.కేవలం బ్రాహ్మణ, క్షత్రియ ,వైశ్యులలో మగవారికి మాత్రమే చదువు కునే అర్హత ఉందని మహిళలను చదువుకుదూరం చేయడం వెనుక గల కుట్ర ఏంటంటే ఆర్యులు మనదేశంలోకి బయటి నుండి రావడం ,అది కూడా మగవారే రావడం ఒక కారణం.పాతివ్రత్యం పేర ,శీలం పేర మహిళలను తమ ఆస్తిగా ఆర్యులు భావించారు. మహిళలు మనదేశంలో వారే కాబట్టి వారిని అణచివేశారు.ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారు మనదేశంలోకి వచ్చారు. విదేశీయులు మనదేశంలోకి రావడానికి కూడా ఈ దేశంలోకి వలసొచ్చి రాజ్యం ఆక్రమించుకొని పాలన చేసిన బ్రాహ్మణ పాలకులే కారణం. బ్రాహ్మణులు చేసిన అధర్మ శాసనం వలన శూద్రులు ఆయుధం ధరించరాదని శాసనం అమలు చేశారు.శూద్రులకు పాలన చేసే హక్కు లేకుండా ఆయుధాలు ధరించే హక్కు లేకుండా చేయడం వలనే మనదేశంలోకి ఆనాడు విదేశీయులు రాగలిగారు.బ్రిటిష్ పాలనాకాలంలో మహాత్మా జోతిరావు ఫూలే చదువుకుని చైతన్య వంతుడై సామాజిక పరివర్తన కోసం తనభార్యతో కలిసి పెద్ద ఎత్తున కులవ్యవస్థ నిర్మూలనకు, అందరికీ చదువుకోసం, మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు.



అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రబోధకులు & న్యాయవాది