జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ మార్చి 9 : భారత జాతీయ మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా లోని మొయినాబాద్ మండల్ లో రెండవ మహాసభ కార్యక్రమానికి మంజుల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫైమిద హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళలపైన జరుగుతున్న హత్యలు అత్యాచారాలు అరికట్టాలంటే భారత జాతీయ మహిళా సమైక్య సంగం, బలోపేతానికై కృషి చేయాలని, మహిళల సమస్యల పైన పోరాడాలని, మహిళల పైన జరుగుతున్న దాడులు వీటన్నిటిని తిప్పి కొట్టాలని,ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పథకాలు అమలు కానీ పరిస్థితి చూస్తున్నాం అని వీటిపైన పోరాడాలని సంఘంలో ఉన్న వారు ఇంకా చైతన్యవంతం కావాలని మొయినాబాద్ మండల్ లో ఏర్పడ్డ నూతన కమిటీ జిల్లా స్థాయిలో ఎదగాలని సంఘానికి మంచి గుర్తింపును తీసుకురావాలని రాబోయే రోజులలో అనేక పోరాటాలు చేయాలని చెప్పడం జరిగింది.
అదే విధంగా సిపిఐ పార్టీ మొయినాబాద్ మండల కార్యదర్శి శ్రీనివాస్ మరియు సుధాకర్ గౌడ్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు కాలేదని వాటిపైన మహిళలు కంకణ బద్దులై బయటకు రావాలని వాటిపైన పోరాటం చేసి ఫలాలు అందుకునే విధంగా కృషి చేయాలని మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కావస్తున్న మహిళలకు ఇంకా రక్షణ లేదని ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు అన్యాయానికి గురి అవుతున్నారని వాటిపైన పోరాడాల్సి ఉందని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో బి.కె.ఎం.యు అంజయ్య మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని వారికి మా సహాయ సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. మొయినాబాద్ మండల్ లో ఎన్నుకున్న నూతన మహిళా కమిటీ 11 మందితో ఏర్పరచుకోవడం జరిగింది అధ్యక్షురాలుగా మమత కార్యదర్శిగా మా దేవి, ఉపాధ్యక్షులు బాలమణి వర, అధ్యక్షురాలు అనురాధ, సహాయ కార్యదర్శులుగా వెంకటమ్మ ,పెంటమ్మ, శంకరమ్మ మరియు సైజాది బేగం, రాములమ్మ, చంద్రమ్మ లతో వినూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ,మండల మహాసభలో స్థానిక గ్రామ కార్యదర్శి పుల్ల గళ్ళ మల్లేష్ వి రాములు నర్సింలు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.