– మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలకు సూచనలు – నీటి సమస్యలు రాకుండా చూసుకోవాలి – జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,మార్చి 07 : ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అదేవిధంగా నీటి సమస్య రాకుండా చూసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కార్యాలయం లో శుక్రవారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయంలో సి.నారాయణ రెడ్డి సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు సూచించారు. ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను పూర్తి చేయుటపై, తాగునీటి ఎద్దడి రాకుండా చేపట్టవలసిన చర్యలపై ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల గ్రౌండింగ్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను పూర్తి చేయుటపై మొదటి ప్రాధాన్యత ఇస్తూ వేగవంతం చేయాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్ ( లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం)ను సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించి ఎల్ ఆర్ ఎస్ సద్వినియోగం చేసుకునేలా చేయాలని అన్నారు.తాగునీటి పై సమీక్ష నిర్వహిస్తూ వేసవికాలం దృష్ట్యా ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా కార్యచరణ రూపొందించి నిరంతరం నీటిని అందించే విధంగా ప్రణాళిక బద్ధంగా అమలు చేయాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాలలో చేపట్టవలసిన మరమ్మత్తులు చేపట్టాలని, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రణాళికా ప్రకారం చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ద వహించి నీటి ఎద్దడి రాకుండా చూడాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో మిషన్ భగీరథ గ్రిడ్ ఇంట్రా పనులను మార్చి 15వ తేదీ వరకు గ్రౌండింగ్ చేపట్టి 20వ తేదీ వరకు పనులు పెండింగులో లేకుండా పూర్తి చేయాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులపై మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకై చేసుకున్న దరఖాస్తులలో అర్హత ఉన్న దరఖాస్తుల గ్రౌండింగ్ చేయుటలో వేగం పెంచి పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో అర్హులైన దరఖాస్తులకు మంజూరీ ఇచ్చే విధంగా పని చేయాలన్నారు. త్వరితగతిన గ్రౌండింగ్ పనులు పూర్తి చేసి జిల్లాలో పెండింగ్ లేకుండా మీరంత పని చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, మిషన్ భగీరథ ఈఈ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, మండలాల నుండి ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.