జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, ఫిబ్రవరి 28. పిల్లల్లో సృజనాత్మక విలువలు వెలికి తీసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ప్రముఖ వైద్యులు అనిల్ కుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం జరిగిన ఎక్స్పో నేషనల్ సైన్స్ డే వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్యులు అనిల్ కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణి ముఖ్య అతిధి ని ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ముఖ్యఅతిథి సైన్స్ నమూనాలను తయారు చేసిన విద్యార్థుల వద్ద వాటి వివరాలను పనితీరును అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా చక్కగా వాటి పనితీరును తెలిపారు. విద్యార్థులు ఎంత అద్భుతంగా సైన్స్ డే సందర్భంగా నైపుణ్యంతో కూడిన నమూనాలను తయారు చేయడం జరిగిందన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన కలిగిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీన్ జానయ్య సి బ్యాచ్ ఇంచార్జి రాంబాబు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.