సర్ సివి రామన్ గారి జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమం

సర్ సివి రామన్ గారి జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమం


జ్ఞానం తెలంగాణ,వనపర్తి జిల్లా ప్రతినిధి :
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏదుల మండలం నందు ఘనంగాసైన్స్ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సైన్స్ మేళాను నిర్వహించారు. విద్యార్థులు ఈ ప్రదర్శనలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. వివిధ రకాల సైన్స్ ప్రయోగాలు వాటి ఉపయోగాలు చక్కగా వర్ణించారు. చూపరులకు ఆకట్టుకునే విధంగా విద్యార్థులు తెలిపారు ఏదుల గ్రామంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు సైన్స్ మేళను సందర్శించారు
“లో కాస్ట్ నో కాస్ట్” అనే పద్ధతిలో విద్యార్థులు వివిధ రకరకాల ప్రయోగాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు సైన్స్ మేళాను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సైన్స్ లే జగతికి మూలం అదే అభివృద్ధికి కారణం, అందరూ సైన్స్ ని నమ్మాలి మూఢనమ్మకాలను వదిలివేయాలి వాస్తవ దృక్పథంలో జీవించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు అయినటువంటి మద్దిలేటి సార్ ని మరియు జ్యోతి మేడం ని అభినందించారు. విద్యార్థులకు సైన్స్ అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. సైన్స్ ఉపాధ్యాయులను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు శ్రీమతి గౌతమి, ఉపాధ్యాయులు బిచ్చి రెడ్డి ,దాసు, రాజు, డాక్టర్ వి భానుచందర్, బాలు, కేజియారాణి, విజయ్ కుమార్ రెడ్డి,సైయుదుద్దీన్, ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్, అష్వఖ్ అహ్మద్, వై అరుణమ్మలు, ఇక ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు

You may also like...

Translate »