మానవాభివృద్ధికి సైన్సే మూలం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

సైన్స్ ఉపాధ్యాయులకు సన్మానం


జ్ఞానతెలంగాణ,సిరిసిల్ల :
మూడ నమ్మకాలతో తిరోగమనం చెందుతున్న మానవ సమాజానికి విజ్ఞాన శాస్త్రం ఎంతో అవసరం అని గర్జనపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంగల శ్రీనివాస్ అన్నారు.
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు సైన్స్ కు సంబంధించిన వివిధ పరికరాలను ప్రదర్శించి, ప్రయోగాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను పారద్రోలాలంటే విద్యార్థులు విజ్ఞాన శాస్త్రం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
మనం నేర్చుకునే ప్రతి విషయం హేతుబద్ధంగా, శాస్త్రీయంగా ఉండేలా చూసుకోవాలన్నారు.చదువుకున్న వారిద్వారానే సమాజం బాగుపడుతుందని అన్నారు.అంతకుముందు సర్ సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, రవి, ప్రేమ్ సాగర్ లను సన్మానించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, బలరాం, మంజుల, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు

You may also like...

Translate »