నైన్ పాక ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

జ్ఞానతెలంగాణ,చిట్యాల,ఫిబ్రవరి 28 :


జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నైన్ పాకలో lప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఊర్మిళా రెడ్డి జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం ప్రారంభమైనది.ఇట్టి ఉత్సవంలో ఎగ్జిబిట్స్ ప్రదర్శన, క్విజ్ పోటీలు, డ్రాయింగ్ పోటీలు, వ్యాసరచన పోటీలు, మరియు సాంస్కృతిక ప్రదర్శనలు చేయనైనది. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ చూపరులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమం సైన్సు ఉపాధ్యాయులు స్వాతి, పల్లవి,రాజయ్య మరియు నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించనైనది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుధాకర్, ప్రణీత, విజయశాంతి, సుజాత, రమేష్, సుభాషిని, రఘు, ప్రసాద్,ఓదెలు మరియు సిఆర్పి తిరుపతి పాల్గొన్నారు.

You may also like...

Translate »