ఎందుకంటే ‘ ట్రంప్’ మొరటు ‘మొగుడు’ కనుక. ట్రంప్ బొత్తిగా మర్యాద తెలియని వ్యక్తి. అతడు స్వతహాగా వ్యాపారి. సహజంగా వ్యాపారస్తులు తమ కస్టమర్లతో చాలా వినయంగా, మర్యాద పూర్వకంగా మాట్లాడతారు. ఎందుకంటే … వ్యాపారంలో “కస్టమరే దేవుడు” కనుక. కొన్నిసార్లు కస్టమర్ కు వస్తువుల నాణ్యత విషయంలో కానీ,ధర విషయంలో కానీ అనుమానం వచ్చినా, అతనికి కోపం వచ్చినా, కస్టమర్ ను సముదాయించడానికే వ్యాపారి ప్రయతిస్తాడు.వ్యాపారస్తుని మొఖంలో ఎప్పుడూ చిరునవ్వునే చూస్తాం.వ్యాపారంలో ఎంతో ఓపిక ,మాటల చాతుర్యం అవసరం. వ్యాపారి కూడా మానవమాత్రుడే.అతనికీ అందరికీ లాగే కోపతాపాలు,భావోద్వేగాలు ఉంటాయి.అయితే ఆ అవలక్షణాలను బయటకు కనిపించకుండా చక్కగా నటిస్తాడు. అతని లక్ష్యం ఎలాగైనా సరే, తన వస్తువులను కష్టమర్ కొనుక్కునేలాగా చూడటం.వ్యాపారి చాలా వినయంగా కస్టమర్ కోణం వైపుగా మాట్లాడుతూనే తన మాటల గారడీకి వినియోగదారుడు పడిపోయేలా చేసి, తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ, లాభాలను పొందుతాడు.కొన్నిసార్లు ప్రస్తుత సమావేశంలో కస్టమర్ నుండి వ్యాపారికి లాభం రాకున్నా…అసంతృప్తి పొందడు. తన వస్తువులను కస్టమర్ కి ఇవ్వడానికే వ్యాపారి ముందుకు వస్తాడు.దీనికి కారణం భవిష్యత్తులో ఆ కస్టమర్, తిరిగి తన దుకాణానికే వచ్చి మరికొన్ని వస్తువులు దీర్ఘకాలం కొనేలా, చేసుకోవటమే వ్యాపారుల వ్యాపార రహస్యం. దక్షతగల ఏ వ్యాపారీ తన వ్యాపారంలో ఎప్పుడు నష్టపోడు. ఎలాగైనా సరే తన వస్తువులను కస్టమర్లకు అంటగట్టడం అనేదాన్ని ఒక కళగా వ్యాపారస్తుడు జీవితాంతం సాధన చేస్తూనే ఉంటాడు.కొందరికి జనమతహాః ఈ లక్షణాలను పొందుతాడు.కానీ ట్రంప్ వ్యాపారి అయినప్పటికీ ఈ సున్నిత లక్షణాలు అబ్బలేదు.మాట కఠువు.నడత అడ్డదిడ్డం.
ట్రంప్,మోదీ ఇద్దరు గొప్ప మిత్రులుగా కౌగలించుకున్నారు. ” మోదీ గొప్ప నాయకుడనీ , ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారనీ, అందరూ అదే అనుకుంటున్నారని”, పొగడారు.అందుకు మోదీ స్పందిస్తూ ” నిత్యం దేశం గురించి ఆలోచించడమనే అద్భుతమైన నాయకత్వం లక్షణం ట్రంప్ కు ఉన్నదనీ, తాను కూడా అదే స్ఫూర్తితో వ్యవహరిస్తానని” మోదీ చెప్పుకున్నారు.”మేం కలసికట్టుగా ఎవరినైనా జయిస్తాం, ఒకరినొకరు జయించాలని మాత్రం అనుకోవడం లేదని” ట్రంప్ చక్కని మాటన్నారు.ఇలా మీడియా ముందు దేశాధి నేతలు మధ్య ఈ పొగడ్తలు మామూలే. పొగడ్తలంటే ఇష్టంలేనిదెవ్వరికి? ఇలా పరస్పరం పొగుడుకుంటూనే, ఎవరి ప్రయోజనాల కోసం వారు పాకులాడారు.
మోత్తానికి మోదీ అమెరికా వెళ్ళి సాధించిందీ ఏమీ లేదు. సహజంగా అంతర్జాతీయ సంబంధాలలో, ఒక దేశాధినేత మరొక దేశానికి వెళ్ళినప్పుడు, చర్చలు జరిగే అవకాశాలు ఉన్నప్పుడు, ఆదేశానికి వ్యతిరేకంగా ఆతిధ్యం ఇచ్చిన దేశ అధ్యక్షుడు గాని, ప్రధానమంత్రి గాని తక్షణం ఎదుటి వారి మనసును నొప్పించే పనిని ఎవరూ చేయరు . కనీసం ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రకటనను కూడా ఎవరూ విడుదల చేయరు .కానీ, ట్రంప్ ఇలాంటి అంతర్జాతీయ మర్యాదలకు, గౌరవాలకు ఏమాత్రం విలువను ఇవ్వడు. ఆయన ప్రవర్తన ఎప్పుడు మొరటుగా ఉంటుంది. మాట దురుసుగా ఉంటుంది. మన ప్రధానమంత్రి మోడీ అమెరికాలో ఉండగానే , అమెరికాలో ఉంటున్న మన అక్రమ వలస దారులను వెంటనే ఇండియాకు రెండు మిలిటరీ కార్గో విమానాల్లో తిప్పి పంపడాన్ని మరోసారి కొనసాగించారు. అంటే మోడీ మాటకు విలువ లేనట్టే కదా! ఆయనను అవమానించినట్లే కదా!! పైగా మన భారతీయ అక్రమ వలస దారులను వెనక్కి పిలిపించుకుంటాము అని మోదీ అన్నప్పటికీ, తాను చేయదలుచు కున్నదేదో ట్రంప్ చేసి చూపించాడు. మోదీ ఇండియాకు తిరిగి వెళ్లిపోయేంతవరకైనా కనీసం ట్రంప్ ఓపిక పట్టలేక పోయాడు.
అదే ట్రంప్ మొరటు మార్క్ స్టైల్ అంటే.తాను అగ్ర రాజ్యాధినేతను అనే పొగరు, ధీమా, ఆధిపత్యం ఆయన ప్రతి మాటల్లో, ప్రతి కదలికల్లో, ప్రతి చేష్షల్లో వద్దన్నా కనిపిస్తూనే ఉంటుంది.
వ్యాపార,వాణిజ్యాల విషయంలో భారత్ తమకు మిత్ర దేశమే అయినా “ప్రతీకారం టారిఫ్” విధించే తీరుతాం . “వెనుకకు తగ్గేదీలే” అని మోదీ సమక్షంలోనే మీడియాకు ట్రంప్ ప్రకటించటం ఒక అనాగరిక చర్య.
మోదీతో భేటీకి కాస్తంత ముందే “ప్రతీకార సుంకాల” ఫైల్ పై సంతకం చేయటం,దాన్ని పత్రికలకు విడుదల చేయటం మర్యాద కాదు.
డోనాల్డ్ ట్రంప్ కోపాన్ని కాస్తంత తగ్గించేందుకు అమెరికా యాత్రకు ముందే మోదీ అమెరికా ఉత్పత్తులయిన హార్లీడేవిడ్సన్ బైకులూ, ఎలాన్ మస్క్ కార్లూ ఖరీదు తగ్గేట్టు చేసినా భారత్ సుంకాలమీద మాత్రం ట్రంప్ మోదీ సమక్షంలోనే వ్యంగ్యంగా, గట్టిగా మాట్లాడారు, ప్రత్యక్ష హెచ్చరికలే చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్యంలో అమెరికాకు వంద బిలి యన్ డాలర్ల లోటు ఉన్నదని అంటున్న ట్రంప్ ఈ విషయంలో అమెరికన్లకు న్యాయం జరిగేలా చేస్తానని కూడా బాహాటంగానే స్పష్టం చేశారు.
ట్రంప్ తో వ్యాపార సంప్రదింపుల వ్యవహారం అంత సులభం కాదనీ, ప్రపంచదేశాల నాయకులకూ సైతం అర్ధం అయింది.అవికూడా నెమ్మదిగా ట్రంప్ తో కాళ్ళ బేరానికి వస్తున్నాయి.ఇప్పుడు భారత్ కు చైనాతో సరిహద్దుల్లో శత్రుత్వం పెరిగిన నేపథ్యంలో భారత్ కు అత్యాధునిక యుద్ధ విమానాల అవసరం కూడా పెరిగింది. ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలు కు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ట్రంప్ ముందు మోదీ తల వంచక తప్రలేదు. ———— అక్రమ వలసదారులను వెనక్కు తెచ్చు కోవడం, సుంకాల విషయంలో రాజీపడటం, యుద్ధవిమానాలతో సహా అతిఖరీదైన ఆయుధసామగ్రిని కొనుగోలు చేయడం, డ్రిల్ బేబీ డ్రిల్ అంటూ చమురు తోడిపోస్తున్న అమెరికానుంచి భారీగా ఇంధనాన్ని కొనుగోలుచేయడానికి సంసిద్ధత ప్రకటించటం మొదలైన చర్యలు కచ్చితంగా అగ్ర రాజ్య అధిపతి ట్రంప్ అధికారం ముందు మోదీ తలవంచక తప్పలేదు. నిన్నటి వరకు నాటో కూటమి సభ్య దేశాలైన యూరప్ దేశాలను సైతం అమెరికా కోసం లక్షపెట్టని ట్రంప్, మోదీ ఎంత మంచి స్నేహితుడైనా అమెరికా వ్యాపార ప్రయోజనాల ముందు ఈ రాజకీయ స్నేహ సంబంధాలు నిలుస్తాయా!!.