జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07:
సంగారెడ్డి జిల్లాలో మీ సేవలో పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి వల్లూరి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లో, ఇరిగేషన్, రెవెన్యూ ల్యాండ్ సర్వే తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో మీ సేవ కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.