శంకర్ పల్లి మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షునిగా సి ఎల్లయ్య
జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ,జనవరి 31 :
శుక్రవారం నాడు మండల ప్రజా పరిషత్ భవనంలో పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షులు, శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన శంకర్పల్లి మండల పంచాయతీ కార్యదర్శుల మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. శంకర్ పల్లి మండల పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షునిగా మోకిలా గ్రామ పంచాయతీ కార్యదర్శి, సి ఎల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పంచాయతీ కార్యదర్శుల మండల అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి సి ఎల్లయ్య మాట్లాడుతూ మండలంలో ఉన్న పంచాయతీ కార్యదర్శుల యొక్క సమస్యలు తీర్చడానికి ముందుంటానని ఆయన తెలిపారు. నన్ను పంచాయతీ సెక్రటరీ సంఘం మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ కి, శంకర్పల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పంచాయతీ సెక్రటరీలకు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీల సంఘ అధ్యక్షుడు సి ఎల్లయ్య , కార్యదర్శి శరణ్, ట్రెజరర్ ప్రమీల, ఉపాధ్యక్షులు సి సుదర్శన్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, సత్యనారాయణ, రియాజ్, రమ్య, దివ్య, పుష్పలత, తిమ్మారెడ్డి,మహేందర్ రెడ్డి,నవీన్,హమీద్ తదితరులు పాల్గొనడం జరిగింది.