జ్ఞాన తెలంగాణ,నారాయణ పేట ప్రతినిది, జనవరి 28: నారాయణపేటకు జిల్లా దామర గిద్ద బాపన్పల్లి గ్రామానికి చెందిన సామాజిక వేత్త గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్‌తెలంగాణ ప్రభుత్వ పథకం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు భూమి లేని రైతు కూలీలలకు ఏటా రూ.12వేలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం రూపొందించిందని.. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో 129 మున్సిపాలిటీల్లో 8లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకు ఇచ్చి మున్సిపాలిటీల్లోని వారికి ఇవ్వకపోవడం సరికాదన్నారు. రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని చెప్పారు. కేవలం గ్రామాల్లో ఉన్న రైతు కూలీలకే ఈ పథకం వర్తింప జేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు అనంతరం హైకోర్టు స్పందిస్తూ 4 వారాల్లో మున్సిపాలిటీల్లోని రైతు కూలీలను ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకంలోకి తీసుకోవాలని ఆదేశించింది.ఈమేరకు సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.