ప్రతి పౌరుడు తన హక్కుల తో పాటు కర్తవ్యాలను పాటించడం లో బాధ్యత తీసుకోవాలి

ఐ సి ఎఫ్ ఎ ఐ లా కాలేజ్ ప్రొఫెసర్ డీన్ వై ప్రతాప్ రెడ్డి


జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని, ఐసిఎఫ్ఎఐ లా స్కూల్, ఐఎఫ్ హెచ్ఈ హైదరాబాద్‌లోని లీగల్ ఎయిడ్ సొసైటీ 2025, జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొద్దుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో వీధి నాటకాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం లో రాజ్యాంగంలో పేర్కొన్న పౌరుల ప్రాథమిక కర్తవ్యాలను హైలైట్ చేస్తూ, ప్రజలలో అవగాహన కల్పించి, బాధ్యతాయుతమైన పౌరులుగా మారడానికి రూపొందించబడింది.
ఐ సి ఎఫ్ ఏ ఐ లా స్కూల్ డీన్ ప్రొఫెసర్ వై. ప్రతాప్ రెడ్డి రాజ్యాంగం ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు కర్తవ్యాలను పాటించడంలో బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
లీగల్ ఎయిడ్ సభ్యులు ఆర్టికల్ 51ఎ కింద ఉన్న పదకొండు ప్రాథమిక కర్తవ్యాలను వివరించే చక్కని పోస్టర్లను ప్రదర్శించారు. వీధి నాటకం విద్య, పర్యావరణ కాలుష్యం, మరియు మూఢనమ్మకాల వంటి ప్రధాన సమస్యలపై చైతన్యాన్ని కలిగించింది.కార్యక్రమం చివరిలో, గ్రామస్తులు మరియు విద్యార్థులు ఈ కర్తవ్యాలను తమ జీవితాల్లో పాటించేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో లా స్కూల్ ప్రొఫెసర్లు, ఇక్ఫై లా విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...

Translate »