జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పర్వేద, శంకరపల్లి మండలంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ఈరోజు జెడ్ పి హెచ్ ఎస్ పర్వేదలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. నరసింగ రావు గారు, మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్ గారు, మాజీ ఎంపిటిసి శ్రీ వెంకట్ రెడ్డి గారు, మాజీ ఉపసర్పంచ్ ఎల్లయ్య గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవాలని విద్యార్థులు కష్టపడి మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని తెలియచేశారు.
కార్యక్రమంలో పర్వేద గ్రామ పెద్దలు కిష్టారెడ్డి, జనార్దన్ రెడ్డి గార్లు విద్యార్థులు క్రీడలలో రాణించాలని 50 వేల రూపాయల ఆట సామాగ్రిని అందించడం జరిగింది. విద్యార్థులు ఈ సామాగ్రిని చక్కగా వినియోగించుకొని జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో క్రీడలలో రాణించాలని వారు కోరడం జరిగింది. యువసేన యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి వారి సభ్యులు ఆటల పోటీల సందర్భంగా పదివేల రూపాయల బహుమతులకు ఇవ్వడం జరిగింది. మాజీ ఎస్ఎంసి చైర్మన్ పి మల్లేశం గారు పాఠశాల మౌలిక వసతులకు పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది.
అదే విధంగా వచ్చే పదవ తరగతి పరీక్షలలో ప్రథమ ద్వితీయ స్థానంలో వచ్చిన వారికి పదివేల రూపాయల క్యాష్ ప్రైస్ ఇస్తామని మాజీ సర్పంచ్ అనిత సురేందర్ గౌడ్ గారు తెలియజేయడం జరిగింది. విద్యార్థులు చక్కగా చదువుకొని గ్రామానికి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మంచి పేరు తీసుకురావాలని వారు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అనంత రెడ్డి,సాహితీ సమితి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, అనంత కిషన్ పంతులుగారు గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, సభ్యులు, వారితోపాటు ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ చారి, నందు విశ్వనాథ్,రాజేందర్, రాజు, కవిత, కాంచన లక్ష్మి, బసవరాజు, విద్యార్థులు, పాఠశాల పూర్వ విద్యార్థులు మొదలగు వారు పాల్గొన్నారు.