భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గం జనరల్ బాడీ మీటింగ్ ను విజయవంతం చేయండి

సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పార్టీ శ్రేణులకు పిలుపు

– నియోజకవర్గం ఇన్చార్జి కే రామస్వామి


జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 25 :

చేవెళ్లలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నియోజకవర్గం ఇన్చార్జి కే రామస్వామి అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్ లో చేవెళ్ల నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశం ఉంటుందని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు హాజరు అవుతున్నారు కాబట్టి పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు ప్రజాసంఘాల నాయకులు కార్మికులు కర్షకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జనరల్ బాడీ సమావేశంలో విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలన వచ్చి సంవత్సర కాలం గడిసిపోయిన 6 గ్యారంటీలు అమలు కావడంలేదని రెండు గ్యారెంటీలు మాత్రమే అమలు అవుతున్నట్టుగా ఉన్నదని ప్రజలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గ్రామాలలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలలో రైతు భరోసా కేంద్ర ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తామని ఇప్పుడు మాట మార్చి ఎకరాకు 12000 మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఏఐకేస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం చేవెళ్ల మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి మొయినాబాద్ మండల కార్యదర్శి కే శ్రీనివాస్ శంకర్ పల్లి మండల కార్యదర్శి సుధీర్ షాబాద్ మండల కార్యదర్శి ఎన్ జంగయ్య ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ బి కే ఎం యు జిల్లా అధ్యక్షులు జై అంజయ్య ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల చేవెళ్ల మండల సహాయ కార్యదర్శి ఎండి మక్బుల్ మండల అధ్యక్షుడు శివ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »