ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శిబ్యాతల శివశంకర్ మాదిగ
ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమం విజయవంతం కోసం ఈనెల 28న మహేశ్వరంలో జరిగే సన్నాహక సదస్సును ప్రతి గ్రామం నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి మండలం నుంచి చిన్నలు పెద్దలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని డప్పు చప్పులతో కాలికి గజ్జ కట్టి పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సుప్రీంకోర్టు రిజర్వేషన్లు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని చెప్పిన ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయకపోవడంతో పాటు భారత దేశంలోనే ఏ రాష్ట్రము చేయకముందే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చి మాట తప్పిన రేవంత్ ప్రభుత్వానికి ఈ వేల గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమంతో బుద్ధి చెబుతామని మాదిగలతో పెట్టుకుంటే ప్రభుత్వం మనుగడలలో లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎన్నికలకు ముందు చేవెళ్లలో నిర్వహించిన చేవెళ్ల డిక్లరేషన్ సభలో కూడా వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన ఖర్గేతో ఒప్పించి అధిష్టానంతో ఒప్పించి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తొందరగా అమలు చేయాలని హెచ్చరిస్తున్నాము.