రైతు భరోసా పథకం దరఖాస్తులు

రైతు భరోసా పథకం దరఖాస్తులు


జ్ఞానతెలంగాణ, కామారెడ్డి ప్రతినిధి :వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం యాసంగి (2024-25) 01.01.2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హులు.జతపరచాల్సిన పత్రాలు..పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయినా జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్,బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్,పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారం,ఈ పత్రాలను మీ క్లస్టర్ అధికారి అయిన వ్యవసాయ విస్తీర్ణ అధికారికి సమర్పించాలి.గతం లో పెట్టుబడి సహాయం వచ్చినరైతుల బ్యాంకు మరియు అకౌంట్ నంబర్ మార్పులు ఉంటే బ్యాంకు అకౌంట్ నెంబర్ మార్పు కావలసిన రైతులు దరఖాస్తు ఫారం నింపి సమర్పించాలి.01.01.2025 నాటికి భూ భారతి (ధరణి) పోర్టల్ లో ఉన్న పట్టాదారుల డేటా రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు సాయం అందించేందుకు భూమి పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) నుండి పొందబడింది. డిజిటల్ సంతకం అయినా రైతులు అర్హులు.గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారి తెలియజేశారు.

You may also like...

Translate »