మహిళ ఆస్తి కాజేసేందుకు యత్నం

మహిళ ఆస్తి కాజేసేందుకు యత్నం


  • తిమ్మాపూర్ గ్రామానికి చెందిన, మహేందర్ అరెస్ట్,
  • రిమాండ్ కు తరలించిన కొత్తూరు పోలీసులు

జ్ఞాన తెలంగాణ,కొత్తూర్,షాద్నగర్ ప్రతినిధి, 24 :

మహిళకు మాయమాటలు చెప్పి బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లి భయబ్రాంతులకు గురిచేసి ఆస్తి కాజేసేందుకు యత్నించిన వ్యక్తితో పాటు అతడి డ్రైవర్ను పోలీ సులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై శ్రీని వాస్ కథనం ప్రకారం కొత్తూర్ మున్సిపాలిటీలోని తిమ్మాపూర్ కు చెందిన ఎడ్ల శ్రీకాంత్ తో మండల పరిధి మల్లాపూర్ గ్రామానికి చెందిన రాధికకు వివాహమైంది వారికి కుమారుడు ఉన్నాడు. శ్రీకాం త్ గతేడాది అనారోగ్యంతో మృతిచెందాడు. రాధిక ఈనెల 20న ఇంటి నుంచి బయటకి వెళ్లి తిరిగి రాలేదని, శ్రీకాంత్ తల్లి ఎడ్ల హంసమ్మ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు రాధిక కోసం గాలింపు చేపట్టారు ఈనెల 22న రాధిక కొత్తూర్ పోలీస్ స్టేషను చేరుకుని పోలీసులకు అదృశ్యమైన వివరాలు వెల్లడించ డంతో పోలీసులు ఖంగు తిన్నారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ తన భర్త శ్రీకాంత్ గతంలో రియల్ఎస్టేట్ భాగస్వాములు కాగా, మహేందర్ తనకు తరచూ ఫోన్చేసి రియల్ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడుల వివరాలు చెబుతానని తనను నమ్మ బలికినట్లు పోలీసులకు వివరించింది. అయితే, తనను మహేందర్ బలవంతంగా ఈనెల 20న తిరుపతికి తీసుకెళ్లాడని, దారిలో మహేందర్ తో పాటు అతడి డ్రైవర్ శేఖర్ తనను చాకుతో బెదిరించి దాడిచేసి చేతికి ఉన్న ఉంగారంతో పాటు, కొంత నగదు తీసుకొని ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయాలని బలవంతం చేశారని చెప్పింది. వివాహ సమ యంలో తన తల్లి గ్రామంలో ఇచ్చిన ఎకరం భూమిని కాజేయాలనే ఉద్దేశంతో బాండ్ పేపర్ల మీద సంతకం చేయాలని బలవంతం పెట్టారని తెలిపింది. కాగా చివరకు తిరుపతి నుంచి హైదరాబాద కు తీసుక వచ్చారని తెలిపింది. అక్కడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషను చేరుకుని సంఘటన వివరాలు వెల్లడించింది. ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బం దితో గాలింపులు జరిపి మహేందర్,తో పాటు శేఖరను అదుపులోకి తీసుకొని విచారించగా, నేరాని అంగీకరించారు. వారి నుంచి చాకుతో పాటు, కారు, 2సెల్ఫోన్లు, ఉంగరం, కొంత నగదు స్వాధీనం చేసుకు న్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తర లించారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు కృషి చేసిన ఎ స్పై శ్రీనివాస్, కానిస్టేబుళ్లు మహిపాల్, రవికుమార్, హోంగార్డు నరేష్, లను కొత్తూరు సిఐ నర్సింహారావు, అభినందించారు,

You may also like...

Translate »