మహాలింగాపురం సీలికాన్ సిటీ వెంచర్ నిర్వాహకుల నిర్లక్ష్యం, పేద రైతు గడ్డి కుప్ప,నీటి పైపులు దగ్ధం

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :


రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో, నాయకుడి మాణిక్యం తండ్రి వెంకయ్య పొలందగ్గర పశువుల ఆహారాన్ని కోసం రెండు టాక్టర్ ల సోప్ప గడ్డి,నాలుగు టాక్టర్ల కొత గడ్డి,200 మోపుల వరి గడ్డి, వాటర్ గేట్ వాల్స్, నీటి పైపులు పూర్తిగా దగ్ధమైన ఘోర సంఘటన చోటు చేసుకుంది.సిలికాన్ సిటీ వెంచర్ నిర్వాహకులు వెంచర్ లో ఉన్న చెత్తని కాలుస్తున్న సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మంటలు చెలరేగి గడ్డి కుప్ప పై పడటంతో గడ్డికుప్ప దాని కింద ఉన్నటువంటి నీటి పైపులు పూర్తిగా దగ్ధమైపోయాయి.సంవత్సర కాలానికి సరిపోయే విధంగా తన వద్ద ఉన్న పశువులకు ఆహారం కొరకు నిల్వ ఉంచిన గడ్డికుప్ప దగ్ధమవడంతో స్థానిక రైతులు దాదాపు మూడు గంటలు ప్రయత్నించగా మంటలు అదుపులోకి రావడం జరిగింది.కష్టపడి పోగు చేసుకున్న పశువుల ఆహారం దగ్ధమవడంతో రైతు కన్నీరు మున్నీరవుతున్నరు.నష్టపరిహారం ఇచ్చి పేద రైతు ను ఆదుకోవాలని గ్రామవాసులు వెంచర్ నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు.


వెంచర్ లో పిచ్చి మొక్కలను కాల్చిన దృశ్యం

You may also like...

Translate »