గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000!

గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000!


రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లో ఆస్పత్రికి చేరిస్తే ఇచ్చే రివార్డును కేంద్రం పెంచనుంది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే ₹5 వేలను ₹25 వేలకు పెంచుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గాయపడ్డ గంటలో చికిత్స అందితే బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువ. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. కేసులు, తదితర భయాలతో క్షతగాత్రులను చాలామంది ఆస్పత్రులకు తీసుకెళ్లట్లేదు.

You may also like...

Translate »