క్రీడలు సామాజిక రంగాలలో వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడతాయి

- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
- పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను వీక్షించిన ఎమ్మెల్సీ
- మొదటి విజేతలకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి రూ. 40 వేలు నగదు ప్రకటించడం పట్ల క్రీడాకారుల హర్షం
జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా, జనవరి 14 :
క్రీడలు ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంతోపాటు సామాజిక రంగాల్లో వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడతాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం చౌదరిగుడా మండలం పెద్ద ఎలికిచర్ల గ్రామంలో కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్ విక్షించిన అనంతరం మాట్లాడారు. క్రీడలు ఆరోగ్యకరమైన జీవితానికి పునాది వేస్తాయని, శరీరానికి వ్యాయామం లభిస్తుందని చెప్పారు. నేటి తరం యువత కచ్చితంగా తమకు ఇష్టమైన క్రీడారంగంపై ఆసక్తి పెంచుకోవాలని, ఆటలు శరీర దృఢత్వం, సహన శక్తిని పెంచుతాయని చెప్పారు. ముఖ్యంగా మనలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఒత్తిడి, డిప్రెషన్ ను తగ్గిస్తాయని చెప్పారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను చెబుతున్నారని, చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెప్పారు. టోర్నమెంట్ లో విజయం పొందిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లెడ్ చౌదరి గూడ మాజీ జెడ్పిటిసి బంగారు రాములు, కొందుర్గు వైస్ ఎంపిపి రాజేష్ పటేల్ ,కొందుర్గు మాజీ జెడ్పిటిసి తనయుడు రామక్రిష్ణ,కొందుర్గు బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి,
జిల్లెడ్ చౌదరిగూడ బిఆర్ఎస్ అధ్యక్షులు హఫీజ్,పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,మాదేవ్పూర్ రవిందర్ రెడ్డి,జిల్లెడ్ చౌదరి గూడ మండల మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు మీదిగడ్డ బాబురావు, మాజీఎంపీటీసీలు సత్య ప్రమోద్,రాములు,దిమాగణేష్ ,నాయకులునర్సింలు,యం.బాలరాజు మోతిలాల్ నాయక్,అంకం శేఖర్, రాజేందర్ రెడ్డి,ఘనపూర్ నర్సింలు,సలీం,గౌస్, సత్యం, శేఖర్, వెంకట్రాములు,ఏదిర వెంకటేష్,చించేటి ప్రకాష్, అలీం పాషా, బి.శ్రీనివాస్, కోరుకొండ బాల్ రాజ్,రవీందర్, ఆర్గా నైసర్స్ క్రీడాకారులు తదితరులు పాలొగొన్నారు
