రైజింగ్ హాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలోమహిళల ముగ్గుల పోటీలు
జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి :
పెద్దమందడి మండల కేంద్రంలోని రైజింగ్ హాండ్స్ సొసైటీ టీమ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీలో మంగళవారం రోజు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి,గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.ముగ్గులు వేయడం అనేది గ్రామాల్లో ఒక సామూహిక కార్యక్రమం. అన్ని వయసుల మహిళలు,పిల్లలు కలసి వీధుల్లో అద్భుతమైన ముగ్గులు వేస్తారు. ఈ ముగ్గులు సమాజంలోనీ ఏకత్వాన్ని , సామరస్యాన్ని ప్రతిభీంబిస్తాయి. ప్రోత్సహించడానికి ఈ ముగ్గుల పోటీలను నిర్వహించామని రైజింగ్ హాండ్స్ సొసైటీ టీమ్ సభ్యులు చెప్పారు. మొదటి బహుమతి రెండు తూలాల వెండి, రెండో బహుమతి ఒక తులం వెండి,మూడవ బహుమతి రూ.516/- రూపాయలు,(4) సెకండ్ 3వ బహుమతి రూ.516/- రూపాయలు,(5)స్పెషల్ ప్రైజ్ రూ.516/- రూపాయలను విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు,పెద్దలు మరియు మహిళలు పాల్గొనడం జరిగింది.