పెద్దమందడి మండల కేంద్రంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని మంగళవారం రోజు ఎద్ధుల బండ్ల పోటీలు నిర్వహించారు.రైతులను ఉత్సాహపరుస్తూ గ్రామ పెద్దలందరూ సంక్రాంతి పండగ సంబరాలను జరుపుకున్నారు. ఎద్దుల బండ్ల పోటీలలో గెలుపొందిన రైతులకు సింగిల్ విండో అధ్యక్షులు పి. విష్ణువర్ధన్ రెడ్డి, రెండవ బహుమతి పల్లె సత్యనారాయణ సాగర్, ముడవ బహుమతి గొల్ల పుల్లన్న యాదవ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొమ్ము వెంకటస్వామి, సింగిల్ విండో డైరెక్టర్ నరేష్ కుమార్, సేనాపతి, ప్రవిన్ రెడ్డి, సూర ప్రభాకర్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు,నాగభూషణం,పురుషోత్తం రెడ్డి,రాఘవేందర్ , ఇ.మహేష్ , కురుమూర్తి, ఏన్ .కురుమూర్తి మరియు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.