రంగారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జ్యోతి భీమ్ భరత్ గెలుపు!

ఉత్తర్వు లు జారి చేసిన జాతీయ కాంగ్రెస్ కమిటీ !


పార్టీ జాతీయ కమిటీ ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల
ఆన్లైన్ ఎన్నికలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి జ్యోతి భీమ్ భరత్ ఘనవిజయం
ఇప్పటివరకు జిల్లా ఉపాధ్యక్షురాలు పదవిలో ఉన్న ఆమె అనతి కాలం లోనే పార్టీ అభివృద్ధికి చేసిన కృషికి ఇది దక్కిన ఫలితం అని హర్షం వ్యక్తం చేస్తున్నా అభిమానులు, మహిళా కార్యకర్తలు



ఉద్యమ నేపథ్యం నుంచి ప్రజాస్వామిక రాజకీయాల్లోకి తన సహచరుడు, చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్చార్జి పామెన భీం భరత్ తో పాటు ప్రారంభించిన తన రాజకీయ ప్రస్థానం లో ఎల్లవేళలా పార్టీ అభివృద్ధికి, ముఖ్యం గా మహిళా సాధికారత సాధన తో పాటు ,
పార్టీ కి మహిళలకు అను సంధాన కర్తగా కీలక పాత్ర పోషించి, అందరూ మన్ననలు పొందారు.
ముఖ్యంగా చాలా కాలంగా నిస్తేజంగా ఉన్న జిల్లా మహిళా కాంగ్రెస్ ను పునరుద్ధరించి, పార్టీ కార్యక్రమాల లో మహిళా ప్రాధాన్యత పెంచడం లో శ్రీమతి జ్యోతి భీం భరత్ చేసిన కృషి మరువలేనిది అని ప్రజల అభిప్రాయం. ముఖ్యంగా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న గ్రామీణ స్థాయి, మండల స్థాయి, నియోజక వర్గ స్థాయి మహిళా కాంగ్రెస్ కమిటీ లను అందరికీ ఆమోదయోగ్యంగా పునరుజ్జీవనం చేసి, పార్టీ లో మహిళలకు సముచిత స్థానాన్ని, వారికి పార్టీ కార్యక్రమాల్లో భాగ స్వామ్యాన్ని కల్పించ డం లో జ్యోతి భీం భరత్ చేసిన కృషి కి జిల్లా అధ్యక్షురాలు పదవి వన్నె తెచ్చింది అనేది జిల్లా మహిళా కార్యకర్తల ఏకాభిప్రాయం!
ఈ సందర్భంగా తనను బల పరచి , తనకి విజయం చేకూర్చిన జిల్లా లోని ప్రతి మహిళా కార్యకర్త కు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
అదే క్రమం లో తనను వెన్నంటి నడిపించి, ప్రోత్సహించిన సహచరుడు భీం భరత్ కు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

తమ జాతీయ నాయకులు సోనియా, ప్రియాంక గాంధీ ల నాయకత్వం లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దీవెనలతో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ప్రతి మహిళా కార్యకర్త కూ అందుబాటులో ఉంటానని, వినయ పూర్వకంగా తెలిపారు .

You may also like...

Translate »