వైద్య విద్యార్థికి హెల్పింగ్ హాండ్స్ చేయూత

వైద్య విద్యార్థికి హెల్పింగ్ హాండ్స్ చేయూత


జ్ఞాన తెలంగాణ,సంగారెడ్డి :

సంగారెడ్డి జిల్లాకు చెందిన వైద్య విద్యార్ధి ప్రవీణ్ కుమార్ కాకతీయ మెడికల్ కాలేజీ లో మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుతుల కారణంగా కాలేజీ ఫీజులు చెల్లించలేకపోతున్నామని, సహాయం చేయవలసిందిగా కోరగా, స్పందించిన TSCSTEHHS అధ్యక్షులు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ ఈరోజు హెల్పింగ్ హాండ్స్ చారిటీ తరపున సభ్యుల సమక్షంలో సచివాలయంలో శ్రీ ఎన్.శంకర్ సర్ చేతుల ద్వారా చెక్కు రూపంలో Rs.25,000/- లను విద్యార్థికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్రీ బి.గుణ వంత్ రావ్, శ్రీమతి సిఎచ్ గంగా లక్ష్మి, ఎం.ప్రేమ లీల, ఎం.భాను కిరణ్, ఎస్.కిశోర్ కుమార్, కె.పరశురామ్, సిఎచ్ వెంకన్న, టి.ఉమా, బాషా మొదలగు వారు పాల్గొన్నారు.

You may also like...

Translate »