పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగాస్టడీ మెటీరియల్ పంపిణీ
జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి //సంగారెడ్డి రూరల్ //జనవరి 10 :
సంగారెడ్డి మండలం ఫసల్వాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ ని అందజేశారు..తాళ్లపల్లి తాజా మాజీ సర్పంచ్అంకేని ప్రవీణ్ కుమార్ సహకారంతో ఫసల్వాది గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్ (కన్నా యాదవ్ )విద్యార్థులకు పంపిణీ చేశారు…ప్రవీణ్ కుమార్ (కన్నా యాదవ్ )మాట్లాడుతూ నేటి విద్యార్థిని విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి మంచిగా చదివి పదిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, శివకుమార్, శేఖర్, మహేష్, సంతోష్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పి ఆర్ కె సభ్యులు పాల్గొన్నారు..