అశ్వరావుపేటలో రవాణా శాఖ ఆధ్వర్యంలోజాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు
జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట న్యూస్: జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవం లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.రోడ్డు భద్రత పై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమాజంలో రోడ్డు ప్రమాదాల నివారణకు.. పాటించాల్సిన నిబంధనలను ప్రజలలోకి తీసుకువెళ్తున్నామన్నారు. గత సంవత్సరం దేశవ్యాప్తంగా 5 లక్షల వరకు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో లక్ష 50 వేల మంది మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. మిగిలిన వారు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించకపోవడం కూడా సామాజిక రుగ్మత అన్నారు. రోడ్డు భద్రత పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వాహనాలను నడిపేటప్పుడు.. రోడ్లను దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకొని.. స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు అని అన్నారు. వీలైనప్పుడల్లా ప్రజలకు మరియు విద్యార్థులకు రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా రవాణా శాఖ వారు తెలియజేశారు. విద్యార్థులకు రోడ్డు భద్రతపై చిన్నప్పుడు నుంచే అవగాహన కల్పిస్తే రాబోయే తరాల వారు రవాణ వ్యవస్థ పై పూర్తి అవగాహన ఉంటుందని అన్నారు. ఇదిలా ఉండగా అతివేగంగా విద్యార్థులు ద్విచక్ర వాహనాలను అతివేగంగా నడపవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు.