శంకర్‌పల్లి PS పరిధిలో వైన్స్ లో చోరీ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ పరిధి సంగారెడ్డి రోడ్డులో గల సాయి దుర్గ వైన్స్ లో గురువారం ఉదయం గుర్తు తెలియని దొంగలు వైన్స్ ముందు, వెనకాల గల షట్టర్లను పైకి లేపి చోరీ చేశారు. వైన్స్ లో నగదు ఎంత పోయిందో, మద్యం బాటిళ్లు ఎన్ని చోరీ చేశారో క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.