జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి, జనవరి 05:
శరీర దారుడ్యానికి, మానవ ఆరోగ్య సంరక్షణకు, శరీర సమతుల్యతను పాటించడానికి పండ్లు మరియు పండ్ల రసాలు ఎంతో ఉపయోగపడతాయని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని రామ్ మందిర్ రోడ్లో నూతనంగా ప్రారంభిస్తున్న జూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ నగర్ కుంట నవీన్ రెడ్డి పాల్గొన్నారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డిని యాజమాన్యం సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి జ్యూస్ వరల్డ్ ను ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి తో జీవించాలని అప్పుడే ఆర్థిక అభివృద్ధి జరిగి యువత కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్నారు.షాప్ యాజమాన్యం శివ,శ్రీను లకి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యుగేందర్ బిఆర్ఎస్ యువనాయకులు దినేష్ సాగర్, శివచారి,సుధీర్,మధు,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.