క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు

  • షాద్ నగర్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నందారం అశోక్ యాదవ్
  • దూసకల్ గ్రామంలో డిపిఎల్ 10 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

జ్ఞాన తెలంగాణ, ఫరక్ నగర్,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 05:

యువత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు లభిస్తాయని, క్రీడలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నందారం అశోక్ యాదవ్ తెలిపారు షాద్ నగర్ నియోజకవర్గంలో ఆదివారం దూసకల్ గ్రామంలో నిర్వహిస్తున్న డిపిఎల్ 10 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందారం అశోక్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగినప్పుడే గెలుపు సాధ్యపడుతుందని తెలిపారు. క్రీడాకారులు గెలుపు ఓటమలును సమానంగా తీసుకోవాలని, గెలిచిన వారు మరింతగా రాణించడానికి, ఓడిన వారు గెలుపుకోసం కృషిచేయాలని సూచించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయన్నారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు క్రీడాకారులకు అండగా నిలవాలని, వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసి క్రీడాకారుల‌ను ఉత్స‌హా ప‌రిచి.. క్రీడ‌ల్లో పాల్గొన్న క్రీడాకారుల‌కు క‌ర‌చాల‌నం చేసి అభినంద‌న‌లు తెలిపారు ఆర్గనైజర్స్ ప్రకాష్ యాదవ్, మహేందర్ గౌడ్, ఖాజా పాషా, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళీధర్ రెడ్డి , మాజీ ఉపసర్పంచ్ శివకుమార్ యాదవ్, మహేష్ మాల, పేపర్ శివ, నందు గౌడ్, మాధవ రెడ్డి , శ్రీధర్ గౌడ్, డీజే అంజి, హరికుమార్ ,శ్రీరామ్, మల్లేష్ ,ప్రేమ్, రమేష్, నాని, జగన్, రాఘవేందర్ ముదిరాజ్, గ్రామ యువకులు, నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు,

You may also like...

Translate »