కాంగ్రెస్ పార్టీ నూతన ఎస్సీ విభాగం కార్యాలయం ఓపెన్

కాంగ్రెస్ పార్టీ నూతన ఎస్సీ విభాగం కార్యాలయం ఓపెన్
- ముఖ్య అతిథి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రియతమ్,
- ఎస్సీ సెల్ చైర్మన్ పంది పెంటయ్య గారి అధ్యక్షతన,
- హాజరైన షాద్ నగర్ నేతలు ఎర్రోళ్ల జగన్. నాగిని సాయిలు. శీను,
జ్ఞాన తెలంగాణ, కొత్తూరు,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 05:
రంగారెడ్డి జిల్లా ఎస్సి విభాగం అధ్యక్షులు పంది పెంటయ్య గారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్సీ విభాగం కార్యాలయానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారితో పాటు షాద్ నగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు ఎర్రోళ్ల జగన్. నాగిని సాయిలు శీను . హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రియతమ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కార్యకర్తలే కారణమని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తూచా తప్పకుండా ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని గుర్తు చేశారు.