శంకర్‌పల్లిలో ఘనంగా గొల్లకేతమ్మ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు

శంకర్‌పల్లిలో ఘనంగా గొల్లకేతమ్మ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు


శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి చిన్న శంకర్‌పల్లి వార్డులో ఆదివారం గొల్లకేతమ్మ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బోనాలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో బోనం ఎత్తుకొని మల్లన్నకు సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు బొమ్మన్నగారి జయశ్రీ జైపాల్ దంపతులు అన్నదానం చేశారు. బీర్ల పాండు, వెంకటేశం, స్థానిక వార్డు నాయకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

You may also like...

Translate »