బి ఆర్ ఎస్ పార్టీ లో పని చేసిన ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయి.. ఎమ్మెల్యేసబితా రెడ్డి

  • సబ్బండ వర్గాలకు అభివృద్ధి సంక్షేమాలు అందింది కేసీఆర్ హయాం లోనే….కార్తీక్ రెడ్డి
  • నాకు అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు
  • బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మంచర్ల మోహన్ రావు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 03, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరల కారు ప్రభంజనం సృష్టించనుందని రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు మేలు జరిగింది కేసీఆర్ హయంలోనేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి అన్నారు.పార్టీ కోసం పని చేసిన వారికి తప్పక గుర్తింపు వస్తుంది అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మంచర్ల మోహన్ రావు ఏకగ్రీవ ఎన్నికైయ్యారు.శుక్రవారం శంషాబాద్ మండల ఎంపీపీ శ్రీమతి దిద్యాల జయమ్మ శ్రీనివాస్ డీసీసీబీ డైరెక్టర్ బుర్కుంటా సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి నియమించిన నియామక పత్రాని మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు పి కార్తీక్ రెడ్డి పోషెట్టిగూడ గ్రామానికి చెందిన మంచర్ల మోహన్ రావు ని మండల పార్టీ అధ్యక్షులుగా నియమించి నియామక పత్రం అందజేశారు,, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం బి ఆర్ ఎస్ తప్పకుండా అధికారం లోకి వస్తుందన్నారు.
అనంతరం, మోహన్ రావు మాట్లాడుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. అదేవిధంగా నిన్నటి వరకు ఉన్నటువంటి మండల స్థాయి గ్రామస్థాయి కమిటీలను నేటితో రద్దు చేస్తున్నామని అన్నారు, కొత్త కమిటీలను సంక్రాంతి తర్వాత పార్టీ సీనియర్ సమక్షంలో కష్టపడ్డా వారిని గుర్తించి ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో శంషాబాద్ మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాష, జిల్లా నాయకుడు చిన్నగండు రాజేందర్, మాజీ సర్పంచ్ డి సత్యనారాయణ గౌడ్, నాయకులు రమేష్ గౌడ్,జి. అశోక్, కాటి మురళి, గోపాల్, మురళి, జంగయ్య ముదిరాజ్, వీరు చారి, ఎం కృష్ణ, నాగేష్ యాదవ్, బిక్షపతి, కుమార్, శ్రీశైలం, గుంటి చరణ్, విరమలా హనుమంతు ముదిరాజ్, రాజు నాయక్,కె.రాజు, ఆంజనేయులు గౌడ్,భీఖ్య నాయక్, రాము నాయక్,నవీన్,గిరి గౌడ్,మనోహర్ రెడ్డి,సంజీవ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »