-ట్యాక్స్ లకు మాత్రం కట్టాలి…సమస్యలు మాత్రం పట్టవా?
-మున్సిపాలిటీ సిబ్బంది,అధికారులపై మండిపడుతున్న కాలనీ ప్రజలు
జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి జనవరి 04:
షాద్ నగర్ మున్సిపాలిటీ(హైటెక్ కాలనీ)షాద్ నగర్ కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామంటారు కానీ తీరా చూస్తే ఇక్కడ అదేం కనిపించడం లేదనే చెప్పాలి.గత ప్రభుత్వంలో పాలకులు గానీ అధికారులు గానీ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎన్నో కోట్లు నిధులు మంజూరు చేసింది అని కొన్ని బ్యాచ్ మీడియా కొట్టిన భజన అంతా ఇంతా కాదు,ఏకంగా మున్సిపాలిటీకి అవార్డులు,రివార్డులు కూడా ఇవ్వడం కూడా జరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అబ్బే అదేం జరగనట్లే ఉంది ఈ పరిస్థితి చూస్తే మనందరికి. మన షాద్ నగర్ మున్సిపాలిటీలోని హైటెక్ కాలనీలోకి ఒకసారి వెళ్తే అభివృద్ధి ఎంత జరిగింది,ఎలా జరిగిందో చూడొచ్చు.డ్రైనేజీలు లేకపోవడం వల్ల ఇండ్ల నుండి మురికి నీరు నేరుగా రోడ్లపైకి రావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడ ఇంకో వింత ఏంటంటే ఇండ్ల మధ్యన పురాతన బావి ఉండటంతో అందులో నుంచి విషసర్పాలు రావడం వల్ల అటు కాలనీ వాసులకు,ఇటు దారిన వెళ్లే వారు కూడా భయందోళనలకు గురి కావడం జరుగుతుందని చెబుతున్నారు.తద్వారా ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుందని కాలనీ వాసులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే ప్రతి నెల ఇంటీ ట్యాక్స్ ల కోసం మాత్రం మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు వస్తారు,కానీ ఇక్కడ ఉన్న సమస్యలు,ఇబ్బందులు ఏనాడూ పట్టించుకున్న పాపనా పోలేదని ఆరోపిస్తూన్నారు కాలనీ ప్రజలు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హైటెక్ కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కాలనీవాసులు కోరుకుంటూన్నారు.