మహిళలకు మొదటి పాఠశాల స్థాపించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే…. సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు దేశమళ్ళ కృష్ణ

జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 03:
షాబాద్ మండల కేంద్రంలో సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకొని సమతా సైనిక్ దళ్ మండల అధ్యక్షుడు దేశమల్లా కృష్ణ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే విగ్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
సమాజంలో అసమానతల మీద అలుపెరుగనిపోరాటం చేసిన మహిళా అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త, అట్టడుగు వర్గాలో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి, ఉపాధ్యాయురాలు, రచయిత్రి గొప్ప సామాజిక చైతన్య స్ఫూర్తి,శ్రీ సావిత్రిభాయి పూలే.ఒక స్త్రీ మూర్తి వీధుల్లో మురికి నీళ్లను,
పిడకలతో కొట్టించుకుని,
బూతులు తిట్టించుకుని,
భౌతిక దాడులు చేయించుకుని,
మరీ ఈ జాతికి నాలుగక్షరాలు తొలిసారి దిద్దబెట్టిన అమ్మ అని కొనియాడారు.సావిత్రీ బాయిపులే
నువ్వే లేకపోతే!
మాలాంటి వాళ్లకి అక్షరం ఎక్కడిది.?
అక్షరం లేకపోతే అసలు బ్రతుకెక్కడిది..?
భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు , మహిళలకు మొదటి పాఠశాల స్థాపించిన సంఘ సంస్కర్త సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఆ మహానీయురాలికి నా ఘన నివాళులు..!
మహిళా సోదరీమణులకు అందరికీ,జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు