చిట్యాల ఉన్నత పాఠశాలలో ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం

చిట్యాల ఉన్నత పాఠశాలలో ఘనంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం


జ్ఞానతెలంగాణ, చిట్యాల, జనవరి 03:

చిట్యాల ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించామని మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం ఆచరణీయం ఆదర్శనీయమని అన్నారు.పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు శాలువా పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి ఉపాధ్యాయులు నీలిమ రెడ్డి, మోరిశెట్టి సుజాత, గొర్రె విజయలక్ష్మి తుమ్మ మౌనిక,బుజ్జమ్మ,కూచనపల్లి శ్రీనివాస్, బొమ్మ రాజమౌళి, సాంబారు రామనారాయణ, బుర్ర సదయ్య, ఉస్మాన్ అలీ,గడ్డం శంకర్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సూదం సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »