మన్మర్రి పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

మన్మర్రి పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. 1


ఆధునిక భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయిని క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈరోజు షాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాల,మరియు ఉన్నత పాఠశాల మన్మర్రీలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు,మరియు సామాజిక కార్యకర్త మర్పల్లి అశోక్ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయినిలను శాలువతో సత్కరించి, శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చదువులో చురుకుగా గల విద్యార్థులకు బహుమతులు అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారి నినదించిన మహిళ సావిత్రిబాయి పూలే అని,ఆధునిక విద్య ద్వారానే స్త్రీ అభివృద్ధి సాధ్యమని నమ్మిన స్త్రీ విద్యా ప్రధాయిని,నాటి మణువాదాన్ని వ్యతిరేకించి స్త్రీలకు విద్యనందించిన తొలి విప్లవ కారినిఅని, ఆధునిక భారతదేశంలో మహిళ విద్యకు తొలి అడుగులు వేసిన ఆదర్శమూర్తి సావిత్ర బాయి పూలే అని, ఆకటితో ఆలమట్టించే పేదవారిని హక్కున చేర్చుకొని అన్నం పెట్టిన ఆదర్శ దంపతులు సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే అని,ఆనాడు ప్లేగు వ్యాధి సోకిన ఎంతోమంది రోగగ్రస్తులను చేరదీసి వారికి పరి చర్యలు చేసి చివరికి ప్లేగు వ్యాధితో మరణించిన చిరస్మరణీయురాలు జ్యోతి క్రాంతి సావిత్రిబాయి పూలే అని వారి సేవలను కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసప్ప,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ,ఉపాధ్యాయులు చంద్రయ్య,దశరథ్ రెడ్డి,అంబర్సింగ్,సుదర్శన్,పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

  1. ↩︎

You may also like...

Translate »