చౌదర్ గుడ ఉన్నత పాఠశాల లో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా చౌదర్ గుడ ఉన్నత పాఠశాల లో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం


అక్షర జ్ఞానజ్యోతి సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె సునీత గారు మాట్లాడుతూ సావిత్రి భాయి ఫూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా గుర్తించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలంగా మా పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా సావిత్రి భాయి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సావిత్రి భాయి ఫూలే గారి జీవిత విశేషాలను , బాలికల విద్య కోసం వారు చేసిన కృషి గురించి, సామాజిక వివక్షత , బాల్య వివాహాల రద్దు గురించి, వితంతు పునర్వివాహాల పట్ల ఆమె చేసిన కృషి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది, ఈ దేశంలో ఇంకా ఏదో ఒక చోట మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను అరికట్టడానికి విద్యార్థులు విద్యార్థి దశనుండే మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలి అని అన్నారు. అప్పుడే చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యల మీద పోరాటం చేసి విజయం సాధించాలని ఆకాంక్షించారు.తదనంతరం పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ప్రధానోపాధ్యాయులు రాలు k సునీత గారు,ఉపాధ్యాయులు సుశీల గారు, భాను చంద్ర గారు, వాణి గారు,పార్వతి గారు, శిరీష గారు, సన్మానించడమైనది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్, శంకర్ గౌడ్, శ్రీనివాస్, జామ కుషాల్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

You may also like...

Translate »