సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు

హైదరాబాదు లోని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ కార్యాలయంలో సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ మరియు రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంటి ముదిరాజ్ మాట్లాడుతూ సావిత్రీబాయి ఫూలే జయంతిని జనవరి 3న ఆమె గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం, ఈ రోజును ఏటా “మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం”గా జరుపుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేశారు.అంధకార భారతావనిలో మెరిసిన వేగుచుక్క సావిత్రీబాయి ఫూలే అని కొనియాడారు. ఆమె బాలికా విద్యను ప్రోత్సహించి సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి కృషి చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం,తెలంగాణ మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు జి.ప్రియ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తుల మహేష్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి రాసునూరి లక్ష్మణ్,రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ముచ్చర్ల మల్లేష్, బండారి రాజు,కల్పన తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »