జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 03: చేవెళ్ల మండలంలోని జాల గూడెం గ్రామంలో గ్రామ శాఖ కార్యదర్శి అంజిరెడ్డి అధ్యక్షతన భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంత ఉత్సవాల లో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై సిపిఐ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని దేశ స్వాతంత్రం కోసం కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసిన ఘనత ఒక్క సిపిఐ పార్టీకే దక్కుతుందని కొనియాడారు దేశంలో ఎన్నో రంగు రంగుల పార్టీలు పుట్టుకొస్తూ ఉంటాయి కనుమరుగై పోతుంటాయి కానీ సిపిఐ పార్టీ మాత్రం సృష్టి ఉన్నంత వరకు మనిషిలో రక్తం ఉన్నంతవరకు బతికే ఉంటుందని కష్టజీవులకు ఎండిన డొక్కలకు కార్మిక కర్షక రైతులకు అండగా ఉండి నిరంతరం వారి హక్కుల సాధనకై పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క గొప్పతనాన్ని గ్రామ గ్రామాన వాడవాడల తెలియపరచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి బి కే యం యు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య మహిళా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు మీనాక్షి ఆశా వర్కర్ కళావతి విజయమ్మ లలిత యశోద సుగుణమ్మ వెంకటమ్మ ఏఐటీయూసీ మండల నాయకులు యాదగిరి శ్రీకాంత్ పెంటయ్య బీరప్ప సత్తయ్య బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు