జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 31:
ఈరోజు మధ్యాహ్నము షాద్నగర్ డిప్యూటీ డిఎం హెచ్ ఓ ఆఫీసులో డాక్టర్ బి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో షాద్నగర్ డివిజన్ లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లోని వైద్య అధికారులకు, హెల్త్ సూపర్వైజర్లకు, డీఈఓ లకు మరియు ఏఎన్ఎం లకు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో డాక్టర్ వి విజయలక్ష్మి గారు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క అచీవ్మెంట్ గురించి తెలియచేసి, గర్భవతులను ఎర్లీగా గుర్తి త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలని ఏఎన్ఎం లకు తెలియజేశారు. ప్రతి గర్భవతిని ఆన్లైన్లో ఎంటర్ చేయాలని, ప్రతి గర్భవతికి ఈడిడి డేటు ( కాన్పు తేదీ ) తెలియజేయాలని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆసుపత్రి కాన్పులను పెంచాలని వైద్యాధికారులకు డాక్టర్ విజయలక్ష్మి గారు తెలియజేశారు. పుట్టినప్పటినుంచి 2సంవత్సరములోని పిల్లలందరికీ వ్యాక్సిన్ లను తప్పకుండా వేయాలని ఏఎన్ఎం లకు తెలియజేశారు. గ్రామాలలోని 30 సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరికి బి.పి మరియు సుగర్ పరీక్షలను చేయాలని వైద్యాధికారులకు తెలియజేశారు. బి.పి మరియు షుగర్ పేషెంట్లకు ప్రతినెల మందులను అందజేయాలని ఏఎన్ఎం లకు చెప్పారు. ఈసంజీవిని మరియు ఆన్లైన్ డాటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని డీఈఓ లకు తెలియజేశారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల హెల్త్ సూపర్వైజర్లు మంత్లీ రిపోర్టులను వెంటనే జిల్లాకు పంపవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ హరికిషన్, డాక్టర్ రాఘవేందర్, డాక్టర్ స్రవంతి, డాక్టర్ అమృత జోసఫ్, డాక్టర్ నికిత మేడం, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు,, హెల్త్ సూపర్వైజర్లు డి. ఈ. ఓ లు మరియు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.