సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 31:
షాద్నగర్ పట్టణ పరిధిలో గల మహబూబ్నగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 100 కోట్ల టర్న్ అవర్ చేసిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వ్యవసాయదారులకు బ్యాంకు ఇస్తున్న రుణాల విషయంలో అద్భుతమైన ప్రగతి కనబరిచిందని, రైతులకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తుందని, కేవలం రైతుల కోసమే పక్షాన నిలబడ్డ ఏకైక బ్యాంకు అని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి,డిసీసీబీ డైరెక్టర్స్ మేకగూడ పిఎసిఎస్ చైర్మన్ మంజులా రెడ్డి, డిసీసీబీ డైరెక్టర్స్ షాద్ నగర్ పిఎసిఎస్ చైర్మన్ బక్కన యాదవ్, పిఎసిఎస్ చైర్మన్స్ దామోదర్ రెడ్డి, గొల్లపల్లి అశోక్, జగదీశ్వర్ గౌడ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ పద్మారావు, పిఎసిఎస్ డైరెక్టర్స్ జితేందర్ రెడ్డి, చక్రం రెడ్డి మరియు నోడల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు,