– చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జెండా ఎగురవేసిన జిల్లా కార్యదర్శి శంకర్
– దేశంలో విద్యార్థుల సమస్యల కోసం అలు పెరగని పొరటం చేస్తు, అగ్రగాని విద్యార్థి సంఘంగా, విద్యార్థుల పోరాటాల వేగుచుక్కగా ఎస్ఎఫ్ఐ ఆవిర్భవించింది
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా డిసెంబర్ 31:
చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం ఎస్ఎఫ్ఐ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాయికాడ శంకర్ హాజరై మాట్లాడుతూ 1970లో కేరళలోని త్రివేండ్రంలో ఎస్ఎఫ్ఐ స్వాతంత్రం ,ప్రజాస్వామ్యం ,సోషలిజం లక్ష్యాలతో ఏర్పడిందని అధ్యయనం, పోరాటం నినాదంతో ముందుకెళుతుందని అన్నారు గత 55 సంవత్సరాల నుంచి విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాల నిర్వహిస్తూ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని అన్నారు ఎన్నికలు జరిగినా ఎస్ఎఫ్ఐ గెలవడం అందుకు నిదర్శనమని అన్నారు విద్యార్థుల సమస్యలపై స్కాలర్షిప్స్ ఫీజు నెంబర్స్ మెంట్స్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలపై ఎస్ఎఫ్ఐ అనేక పోరాట నిర్వహిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు అల్లి దేవేందర్ ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ అరుణ్ కుమార్ చేవెళ్ల మండల అధ్యక్షులు సమీర్ కార్యదర్శి చందు మొయినాబాద్ మండలం అధ్యక్షుడు చరణ్ గౌడ్ కార్యదర్శి తేజ ఎస్ ఎఫ్ ఐ నాయకులు పి. నవీన్, పి. శివ, సందీప్, సాయి చరణ్, సిద్దు, ప్రవీణ్,సంతోష్, సౌమ్య, శ్రావణి, మమత, అమూల్య, గాయత్రి, సంధ్య, లావణ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.