మనిషిగొప్పా?దేవుడుగొప్పా దేవుడు సర్వం సృష్టించాడు! ఈ మాట చెప్పింది ఎవరు? ఇది చెప్పినవాడు మనిషి! అదేమనిషి వేసిన ప్రశ్న – దేవుణ్ణి ఎవరు పుట్టించారు? ఇది జవాబులేని ప్రశ్న!
మనిషితప్ప ఏ జీవులకీ భాషా సంస్కృతులులేవు అవిమాటలు నేర్చుకోలేదు! అమెరికా కాకికావ్అంటుంది ఇండియాకాకీకావ్అంటుంది కాని మనిషి భాష నేర్చాడు! దేవుడు మాట్లాడే భాష ఏది?
దేవుడు వృక్షాలు ఇచ్చాడు వాటి కొమ్మలు నరికి మనిషి ఇల్లు కట్టుకోవటం నేర్చాడు! చెక్కతో వస్తువులు చేసాడు రాళ్ళతో భవనాలు కట్టాడు! మూలపదార్ధం దేవుడిది! వస్తు నిర్మాణం మనిషిది!
దేవుడికి గుడికట్టింది మనిషి దేవుడిశిల్పంచెక్కింది మనిషి భక్తితో పూజలు నేర్పించాడు మనుషులెక్కడివాళ్ళక్కడే గుంపులుగా జీవించారు! వ్యవసాయం కనుగొన్నారు! ఇవేవీ దేవుడికి తెలీదు!
గుళ్లో దేవుడు కదల్లేడు! మనిషి సముద్రాలు దాటాడు పడవలు స్టీమర్లు ఓడలు ఇంతటితో ఆగలేదు! బస్సులు రైళ్లు విమానాలు రాకెట్లు కనుగొన్నాడు! దేవుడికి ఇవేవి తెలీదు!
మనిషిది మహాప్రయాణం! లక్షలసంవత్సరాల జర్నీ! నిమ్నోన్నతాలు దాటి నేటికి ఆధునికమానవుడై ప్రతి సృష్టి చేస్తున్నాడు! వీడిది సైన్స్ ప్రపంచం! ఊహించని ఆవిష్కరణలు! దేవుడు గుళ్లోనే ఉన్నాడు!
మనిషివి అన్నీరాజకీయాలు పెత్తనం వెలగబెట్టాలి కదా! కులమతాలు సృష్టించాడు! ప్రజల కష్టం దోచుకున్నాడు! అతి ముఖ్యమైనది డబ్బు! మారకం కోసం సృష్టించాడు! ఇవన్నీ వీడి రాజకీయాలే!
వీడు సృష్టించిన ఈ డబ్బు ఇప్పుడు వీడినే తినేస్తోంది! మాయ రాజకీయాలు చేస్తూ మత రాజకీయాలుసాగిస్తూ వీళ్ళలో వీళ్ళే తన్నుకుంటూ యుద్ధాలు చేసుకుంటూ జనాన్ని చంపేసుకుంటూ!
మంచి చెడు, కష్టం సుఖం లాభం నష్టం అంతా వీడే! దేవుణ్ణి గుళ్లోపెట్టటం కూడా వీడి ధన రాజకీయమే! ఎక్కడా దేవుడి పాత్రలేదు! వీడిది వర్గ రాజకీయం! అదీ”చివరిదశ”కు వచ్చింది!
బడా నాయకులు నేడు దేవుడితోమతరాజకీయాలు చేసేదంతా అమానుషం ! యుద్ధాలు తేవటం తప్ప వీడికి ప్రత్యామ్నాయంలేదు! ‘మోదానీలు’పనికిరారు! ఇక్కడ కూడా దేవుడులేడు!
స్వార్ధం కమ్మేసిన మనిషి తప్పులు చేస్తూ తప్పక ఒప్పువైపు పయనిస్తూ ! ఎప్పటికైనా సత్యమేజయం సమస్తలోకాసుఖినోభవంతు సుదీర్ఘమానవప్రయాణంలో అంతా మానవ ప్రయత్నమే! దేవుడుఉత్స(వ)విగ్రహమే!