పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన యశస్వి దేవ్ కు వెయిట్ లిఫ్ట్ లో బంగారు పతకం

సీఎం కప్ స్టేట్ చాంపియన్షిప్ లో యశస్వి దేవ్ అత్యుత్తమ ప్రతిభ


ఘనంగా అభినందించిన గ్రామస్తులు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 30 : పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన విద్యార్థి యశస్విదేవ్ సీఎం కప్ ఛాంపియన్షిప్ వెయిట్ లిఫ్ట్ లో బంగారు పతకం సాధించాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన దేశపాక దేవేందర్ శ్రీలత కుమారుడు యశస్వి దేవ్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 27 నుంచి 30 వరకు ఎల్బీ స్టేడియంలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో అండర్ 18 విభాగం లో 73 కేజీ లో ప్రథమ స్థానంలో నిలిచి బంగార పథకం సాధించాడు. ఈ సందర్భంగా పెద్ద గోల్కొండ గ్రామస్తులు ఘనంగా అభినందించారు.

You may also like...

Translate »