సీఎం కప్ స్టేట్ చాంపియన్షిప్ లో రజిత పతకం సాధించిన

- పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన దేశ పాగ అనన్య
- ఘనంగా అభినందించిన పాఠశాల యాజమాన్యం గ్రామస్తులు
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 39 : సీఎం కప్ 2024 స్టేట్ చాంపియన్షిప్ అండర్ 18 విభాగం లో మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన దేశపాక అనన్య రజిత పతకం సాధంచింది . రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన దేశపాక దేవేందర్ స్త్రీలతల కూతురు దేశపాక అనన్య శంషాబాద్ లోని టిఆర్ఎస్ పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది ఈనెల 27నుండి డిసెంబర్ 30 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన సీఎం కప్ ఛాంపియన్షిప్ పోటీలో అండర్ 18 బాలికల విసు విభాగం లో 60 కేజీ ద్వితీయ స్థానంలో నిలిచి రజిత పథకం సాధించింది. ఈ సందర్భంగా డిఆర్ఎస్ స్కూల్ యాజమాన్యం పెద్ద గోల్కొండ గ్రామానికి చెందిన పలువురు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ లేవల్లో బంగారు పతకాలు సాధించాలన్నారు.